మంగళవారం రిలీజ్ డేట్ ఫిక్స్

ajay bhupathi mangalavaaram movie release date fixed

ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ గా పరిచయమై మొదటిసినిమాతో బ్లాక్ బస్టర్ కల్ట్ హిట్ ను కొట్టాడు అజయ్ భూపతి. ఇక ఈసినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తాను కూడా మొదటిసినిమాతో హిట్ ను అందుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ మరో సినిమా రాబోతుంది. పాయల్ ప్రధాన పాత్రలో రాబోతున్న సినిమా మంగళవారం. ఈ సినిమా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతుందని అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూాడా మొదలుపెట్టి వరుసగా అప్ డేట్లను అయితే ఇస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ పై ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. ఎప్పటినుండో త్వరలో అంటూ పొడిగించుకుంటూ వస్తున్నారు తప్పా రిలీజ్ డేట్ పై అప్ డేట్ ఇవ్వలేదు. ఇక ఇన్నిరోజులకు ఆ సస్పెన్స్ కు బ్రేక్ పడింది. ఫైనల్ గా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. నవంబర్ 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈసినిమాతో అజయ్ భూపతి నిర్మాతగా కూడా మారుతున్న సంగతి తెలిసిందే. ఏ క్రియేటివ్ వర్క్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి దీనికి ఒక నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కాంతార సెన్సేషన్ అజనీష్ లోక్ నాథ్ పనిచేయనున్నారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మరి అజయ్ తనకు కలిసొచ్చిన హీరోయిన్ పాయల్ తో మరోసారి హిట్ కొడతాడేమో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 18 =