భారీ యాక్షన్ సీక్వెన్స్ తో బిజీగా దేవర

ntr back to action mode for devara movie

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు కొరటాల శివ కూడా ఎక్కువ టైమ్ తీసుకొని మరి ఎన్టీఆర్ కోసం సాలిడ్ కథను తయారు చేశాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే శరవేగంగా జరుగుతున్న షూట్ కు బ్రేక్ పడింది. సైమా అవార్డుల ఈవెంట్ కోసం ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లారు. ఇక తిరిగి రావడంతో మళ్లీ ఎన్టీఆర్ షూట్ లో బిజీ అయిపోయాడు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో బిజీ గా ఉన్నట్టు తెలుస్తుంది. సిటీ శివారులో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారట. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే ఒక హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇక దీని తరువాత మరో లెంగ్తీ షెడ్యూల్ ను మేకర్స్. ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.