టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీలు మరియు పలువురు రాజకీయ నేతలు దీనిపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కోలీవుడ్ ప్రముఖ నటుడు విశాల్ దీనిపై స్పందించారు. ఇటీవల తాను నటించిన ‘మార్క్ ఆంటోనీ’ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో మూవీ సక్సెస్ మీట్ కోసం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఒక జర్నలిస్ట్ చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రశ్నించగా స్పందించిన విశాల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశాల్ ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. “నాకు ఇక్కడ ఓటు లేదు. నేను తమిళనాడులో ఓటు వేస్తాను. నా సినిమా ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల ఈ వ్యవహారాన్ని నేను అంత లోతుగా పరిశీలించలేదు. ఓ కేసు విషయంలో చంద్రబాబు నాయుడుని రిమాండ్‌కు పంపించారు. అయితే ఆయన అరెస్టుకు ముందు వారు ఇంకోసారి బాగా అలోచించి ఉంటే బాగుండేది. ఎందుకంటే దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి నేతకే ఇలా జరిగిందంటే.. ఇక నాలాంటి సామాన్యుడికి భయమేస్తోంది. ఇక అరెస్ట్ సందర్భంగా చంద్రబాబు అడుగుతున్న ప్రశ్నలకు పోలీసుల నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు. ఏది ఏమైనా చివరకు న్యాయమే గెలుస్తుంది. మేం బయట హీరోలం కావొచ్చుగానీ, ఇంట్లో సామాన్యులమే’ అని పేర్కొన్నారు.
ఇక ‘మార్క్ ఆంటోనీ’ సినిమా విషయానికొస్తే.. ఒక గ్యాంగ్ స్టర్ డ్రామాకి టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ వంటి ఇంట్రెస్టింగ్ అంశాలను జోడించి ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కింది. ఈ సినిమాకి తమిళ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశాల్‌తో పాటు ప్రముఖ దర్శక, నటుడు ఎస్జే సూర్య మరో ప్రధాన పాత్రలో సందడి చేశాడు. ఇక ఈ సినిమాలో విశాల్ సరసన ‘పెళ్లిచూపులు’ ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్గా నటించగా.. 7/G బృందావన కాలనీ దర్శకుడు సెల్వ రాఘవన్, టాలీవుడ్ కమెడియన్ సునీల్ ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. అలాగే రీతూ, అభినయ, కింగ్స్లీ, యంజి మహేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సైన్స్, ఫిక్షన్ ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని మినీ స్టూడియో బ్యానర్‌పై ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: