రికార్డులు తిరగరాస్తున్న జవాన్ కలెక్షన్స్

shah rukh khan jawan movie create new records

మొత్తానికి జవాన్ మాత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. గత ఏడాది
పఠాన్ సినిమాతో సంచలనాలు సృష్టించిన షారుఖ్ ఇప్పడు జవాన్ తో సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా హీరోగా తెరకెక్కిన జవాన్ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా రిలీజ్ అయి ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ రావడం ఈసినిమాకు కలిసొచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా రిలీజ్ అయి 13 రోజులు అయిపోతుంది. ఇక 13 రోజుల్లో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 900 కోట్ల గ్రాస్ ను 500 పైగా నెట్ కలెక్షన్స్ ను రాబట్టుకొని 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. దీంతో వేగంగా 900 కోట్లు గ్రాస్, 500 కోట్లు నెట్ రాబట్టిన ఏకైక హిందీ చిత్రంగా నిలిచింది. అంతేకాదు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. తక్కువ టైమ్ లో 450 కోట్లను కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచింది. ఈ ఫీట్ ను అందుకోవడానికి జవాన్ కు 13 రోజులు పట్టగా, గదర్ కు 17 రోజులు అలానే పఠాన్ సినిమాకు 18 రోజులు, బాహుబలి 2 హిందీ వర్షెన్ కు 20 రోజులు పట్టింది. మరి ముందు ముందు ఈసినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

కాగా ఈసినిమాలో నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొనె, ప్రియమణి, సాన్య మల్హోత్ర, సునీల్ గోవర్ కీలకపాత్రల్లో నటించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 10 =