ప్రముఖ సంస్థకు చంద్రముఖి 2 తెలుగు రైట్స్

sri lakshmi movies banner will relese chandramukhi 2 in telugu states

తలైవా రజనీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా చంద్రముఖి అప్పట్లో ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో చూశాం. హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమా తరువాతే అలాంటి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ చంద్రముఖి 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే సీక్వెల్ లో రాఘవ లారెన్స్ నటిస్తున్నాడు. మరి ఇలాంటి సినిమాలు చేయడం ప్లస్ నటించడంలో లారెన్స్ ఎక్స్పర్ట్..అందులోనూ చంద్రముఖి సీక్వెల్ కాబట్టి అంచనాలు అయితే భారీ స్థాయిలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సెప్టెంబర్ 28 వ తేదీన ఈసినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే పోస్టర్లు, పాటలు టీజర్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అయితే మేకర్స్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తెలుగు రైట్స్ ను ప్రముఖ సంస్థ శ్రీ లక్ష్మి మూవీస్ వారు సొంతం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియచేశారు.

కాగా ఈసినిమాలో కంగనా రనౌత్, వడివేలు తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చంద్రముఖి సినిమాకు దర్శకత్వం వహించిన పి.వాసునే ఈసినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రాజశేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. మరి సీక్వెల్ లో ఎలా ఉంటుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + three =