రూల్స్ రంజన్ నుండి దేఖో ముంబై లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

Dhekho Mumbai Lyrical Video Song Released From Rules Ranjann

‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’ సినిమాతో క్రేజ్‌ సంపాదించుకున్న టాలీవుడ్ యువ హీరో కిరణ్‌ అబ్బవరం, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహాశెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఏఎం రత్నం కుమారుడు రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 6వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈ చిత్రం నుంచి మేకర్స్‌ ‘నాలో నేనే లేను’, ‘సమ్మోహనుడా’ సాంగ్‌ల‌ను రిలీజ్ చేయగా.. ఇవి మ్యూజిక్‌ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా మూవీ యూనిట్ ఫోర్త్ సింగిల్ రిలీజ్ చేసింది. ‘దేఖో ముంబై’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను ఈరోజు విడుదల చేసింది. మాస్ మహారాజా రవితేజ చేతులమీదుగా ఈ పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘రూల్స్ రంజన్’ టీమ్ మొత్తానికి రవితేజ శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ సాంగ్‌కు కాసర్ల శ్యామ్, మేఘరాజ్ రవీంద్ర సాహిత్యం అందించగా.. అద్నాన్ సమీ, పాయల్ దేవ్ ఆలపించారు.

అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇటీవలే విడుదల అయిన సినిమా ట్రైలర్ సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదంలో ముంచెత్తింది. ఇక కిరణ్ అబ్బవరం ఈ ఏడాది ఇప్పటికే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మరియు ‘మీటర్’ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఈనెల 28న విడుదల కావాల్సి ఉండగా.. మేకర్స్ దీనిని పోస్ట్ పోన్ చేశారు. అక్టోబర్ 6వ తేదీన భారీస్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + eighteen =