రాజమౌళి సమర్పణలో మేడ్ ఇన్ ఇండియా

rajamouli presents made in india movie

ఇప్పటివరకూ ఎంతోమంది ప్రముఖల మీద, సినీ సెలబ్రిటీలు, క్రీడా కారులు ఇలా పలు రంగాల్లో ప్రముఖులకు సంబంధించిన బయోపిక్ లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య కాలంలో అయితే ఇదే ఒక ట్రెండ్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మరో బయోపిక్ రాబోతుంది. అయితే ఈసారి రాబోతున్న బయోపిక్ ఏదో వ్యక్తికి సంబంధించిన బయోపిక్ కాదు. సినీ పరిశ్రమ మీదే బయోపిక్ రాబోతుంది. మరి ఈ బయోపిక్ ను ప్రజెంట్ చేస్తుంది ఎవరో కాదు రాజమౌళి. అసలు సంగతేంటంటే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజమౌళి అప్పట్లో విశ్వామిత్ర క్రియేషన్స్ అనే బ్యానర్ పెట్టి ఆ బ్యానర్ లో యమదొంగ్ సినిమాను డైరెక్ట్ చేస్తూనే నిర్మించాడు. అయితే ఆసినిమా తరువాత ఆయన మరే సినిమాను నిర్మించలేదు. అయితే చాలా కాలం తరువాత మరోసారి ప్రజెంటర్ గా మారనున్నారు. నితిన్ కక్కర్ దర్శకత్వంలో ఇండియన్ సినిమా ఎలా పుట్టింది.. దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అని తెలుసుకునే నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించనున్నారు. ఇక ఈసినిమాను రాజమౌళి సమర్పణలో తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా తో కలిసి నిర్మించనున్నారు. ఈనేపథ్యంలో రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా ఈవిషయాన్ని తెలియచేశారు. మొదట ఈకథ నెరేషన్ విన్నప్పుడు ఎమోషనల్ గా నన్ను కదిలించింది.. నిజానికి ఒక బయోపిక్ తీయాలంటేనే చాలా కష్టం అలాంటిది.. ఇండియన్ సినిమా మీదే బయోపిక్ అంటే ఇంకా కష్టం అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

బాహుబలి సిరీస్ తో తెలుగు సినిమా సత్తాను దేశవ్యాప్తంగా తెలియచేశాడు. అలానే ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలియచేశాడు. ఇక రాజమౌళి తన తరువాత సినిమాను మహేష్ తో చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ స్థాయిలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా ఈసినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =