అన్నయ్య విజయ్ తో మల్టీస్టారర్ ఉండొచ్చు?

anand deverakonda about multistarrer with his brother vijay deverakonda

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దెేవరకొండ. అయితే ఆనంద్ దేవరకొండ మాత్రం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి మొదటినుండీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ దిశగానే తన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యతను చూపిస్తున్నాడు. ఇక రీసెంట్ గానే బేబి సినిమాాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న ఆనంద్ దేవర్ ఇప్పుడు మరో జోనర్ లో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా కామెడీ యాక్షన్ ఎంటర్ గా రాబోతుందని టీజర్ ను బట్టి అర్థమవుతుంది. అయితే ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. బేబి సినిమాతో ఈసినిమాను కంపేర్ చేయను.. ఏ సినిమా ప్రత్యేకత ఆ సినిమాదే.. ఆ సినిమా అన్ని కోట్లు కలెక్ట్ చేసింది కదా అని ఈసినిమా కూడా అన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పను అని తెలిపాడు. ఈ సందర్బంగా విజయ్ తో సినిమా గురించి అడుగగా.. అన్నయ్య విజయ్ తో మల్టీస్టారర్ ఫ్యూచర్ లో ఉండొచ్చేమో.. ఇప్పుడైతే ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు.. ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చెబుతాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. చూద్దాం మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడొస్తుందో..

కాగా ఈసినిమాలో ఇంకా ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హై లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు ఆదిత్య జవ్వాడి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. త్వరలో రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.