నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజయభాస్కర్ చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతూ వస్తున్న సినిమా జిలేబి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆగష్ట్ 18వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ థ్రిల్ రైడ్ ని అందించింది. ట్రైలర్ లో శ్రీకమల్, శివాని రాజశేఖర్ పాత్రలు వినోదాత్మకంగా వున్నాయి. చివర్లో హారర్ ఎలిమెంట్స్ చాలా క్యూరియాసిటీ పెంచాయి. మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం ఫన్,థ్రిల్ మరింత ఎలివేట్ చేసింది.
కాగా ఈసినిమాలో శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా శ్రీకమల్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి తదితరులు పలు పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్ గా, ఎం.ఆర్. వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: