అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా వస్తున్న సినిమా మంగళవారం. గ్రామీణ నేపథ్యంలో 1990లలో సాగే కథతో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తీస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి టైటిల్ తోనే ఈసినిమాపై క్యూరియాసిటీని పెంచాడు అజయ్ భూపతి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రీసెంట్ గానే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. గణగణ మోగాలిరా అనే పాటను 16వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. చూడబోతే ఈపాట ఫెస్టివల్ సాంగ్ లాగ అనిపిస్తుంది.
Let the vibrance of deity echo in your heart 💥
Trip into the trance with the Jathara song, #GanaganaMogalira on 16th August 🔥
An @AJANEESHB Musical 🥁
An @DirAjayBhupathi‘s Vision 🎬#Mangalavaaram @starlingpayal @MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati pic.twitter.com/ozoqHkBZfS— Ajay Bhupathi (@DirAjayBhupathi) August 12, 2023
కాగా ఈసినిమాతో అజయ్ భూపతి నిర్మాతగా కూడా మారుతున్న సంగతి తెలిసిందే. ఏ క్రియేటివ్ వర్క్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి దీనికి ఒక నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కాంతార సెన్సేషన్ అజనీష్ లోక్ నాథ్ పనిచేయనున్నారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మరి అజయ్ తనకు కలిసొచ్చిన హీరోయిన్ పాయల్ తో మరోసారి హిట్ కొడతాడేమో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: