స్కంద ఆఫ్‌లైన్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్

skanda movie offline promotions start

అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మాస్ మేకర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా స్కంద. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా ను రూపొందిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్‌ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన లభించగా, ఫస్ట్ సింగిల్ నీచుట్టూ చుట్టూ మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రమోషన్స్ లో మరింత వేగం పెంచడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. దీనిలోభాగంగానే తాజాగా మేకర్స్ ఆఫ్‌లైన్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఈ ఫిల్మ్ స్టాండీలు విడుదలయ్యాయి, అన్ని చోట్ల ఏర్పాటు చేయబడ్డాయి. స్టాండీ ఇమేజస్ ఒకదానిలో రామ్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. మరొక ఇమేజ్ రామ్, శ్రీలీల రొమాంటిక్ కెమిస్ట్రీని ప్రజంట్ చేస్తోంది. యాక్షన్ పోస్టర్ మాస్‌ని ఆకట్టుకుంటే, రొమాంటిక్ పోస్టర్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పిస్తుంది.

కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =