అఫీషియల్- డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ దత్

sanjay dutt on board for double ismart movie

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా ఎంత ఘన విజయం సాధించిందో చూశాం. పూరీ డైలాగ్స్ కు రామ్ నటన తోడవ్వడం దానికిి తోడు మ్యూజిక్ కూడా కలిసిరావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక హిట్ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్స్ రావడం కామన్ అయిపోయింది. ఈనేథ్యంలో ఈసినిమాకు కూడా ఇప్పుడు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ తో ఈసినిమాకు సీక్వెల్ రానుంది. రీసెంట్ గానే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ చిత్రయూనిట్ ఈవిషయాన్ని కన్ఫామ్ చేసింది. తాజాగా మేకర్స్ తమ ట్విట్టర్ సంజయ్ దత్ ఈసినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ తన లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు ఈసినిమాలో సంజయ్ దత్ బిగ్ బుల్ అనే పాత్రలో కనిపించనున్నట్టు తెలియచేసారు.

కాగా ఈసినిమాను పూరి కనెక్ట్స్‌ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.