టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే ధమ్కీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు విశ్వక్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. VS10, VS11 అనే వర్కింగ్ టైటిల్స్ తోనే ఈసినిమాలు షూటింగ్ లను జరుపుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా విశ్వక్ సేన్ 11వ సినిమాకు సంబంధించి అప్ డేట్ వచ్చింది. చైతన్య కృష్ణ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ మొదలై సగం షూట్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈసినిమా నుండి విశ్వక్ సేన్, అంజలి ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా ఈసినిమా టైటిల్ కు సంబంధించిన అప్ డేట్ త్వరలో ఇస్తామని విశ్వక్ చెప్పినట్టే నేడు ఆ అప్ డేట్ ఇచ్చారు. సినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ గ్లింప్స్ ను 31వ తేదీన 10 గంటల 19 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
Bringing you the Mass & Rugged #VS11 Title announcement & First Glimpse on July 31st ~ 10:19 AM 💥#KrishnaChaitanya @thisisysr @vamsi84 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios @adityamusic pic.twitter.com/v15dtng6cq
— VishwakSen (@VishwakSenActor) July 29, 2023
కాగాా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ,శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్, గోపి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























