కెప్టెన్ మిల్లర్ టీజర్ రిలీజ్

dhanush captain miller teaser released

తమిళ టాలెంటెడ్ హీరో ధనుష్ మాత్రం డిఫరెంట్ కథలను, కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అందుకే ధనుష్ సినిమాలంటే తమిళ్ ప్రేక్షకులే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రీసెంట్ గానే సార్ సినిమాలో లెక్చరర్ పాత్రలో క్లాస్ లుక్ లో అలరించిన ధనుష్ ఇప్పుడు తన కొత్త సినిమాలో మాస్ అవతారంలో అలరించడానికి వచ్చేస్తున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రీసెంట్ గానే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే అదిరిపోయింది. టీజర్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మిల్లర్ ను చూపిస్తూ.. రివార్డ్ కూడా ప్రకటిస్తారు.. అలా బ్రిటిషర్స్ తో పోరాట సన్నివేశాలు, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉన్న టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్‌ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెంథిల్ త్యాగ‌రాజ‌న్‌, ఆర్జున్ త్యాగ‌రాజ‌న్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈసినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − eight =