టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది కార్తికేయ2, 18పేజీస్ సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు నిఖిల్. ఇక ఈ ఏడాది అదే జోష్ తో హ్యాట్రిక్ కొడదామని స్పై అనే సినిమాతో రంగంలోకి దిగాడు. ఈసినిమాా జూన్ 9 తేదీన రిలీజ్ అయింది. వరుసగా రెండు బ్లాక్ బస్టర్లు అందుకోవడంతో ఈసినిమాతో హ్యాట్రిక్ అందుకుంటాడు అనుకున్నారు. అయితే ఈసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది ఈసినిమా. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఈసినిమా మంచి కలెక్షన్స్ నే అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈసినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో నేడు సైలెంట్ గా ఈసినిమాను రిలీజ్ చేశారు. తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ బాషల్లో ఈసినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు..
కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా అభినవ్ గోమఠం,సన్యా మల్హోత్రా కీలక పాత్రలో కనిపించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా శ్రీ చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.రాజశేఖర్ రెడ్డి,చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: