బేబి సక్సెస్ పై విఘ్నేష్ రియాక్షన్

vignesh shivan praises on baby movie

ప్రస్తుతం సినిమా పరిశ్రమలకు భాషా సరిహద్దులు అనేవి చెరిగిపోయాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాకు మరో భాషలో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అంతేకాదు ఒక భాషలో సినిమా హిట్ అయితే వేరే ఇండస్ట్రీల నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో చిన్న సినిమాకు కూడా పక్క ఇండస్ట్రీల నుండి గుర్తింపు లిభిస్తుంది. ఆసినిమా మరేదో కాదు రీసెంట్ గా రిలీజ్ అయి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న బేబి సినిమా. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందించింది చిత్రయూనిట్. ఈసినిమా కూడా మౌత్ టాక్ తోనే మంచి ఆదరణను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాపై ఇప్పటికే హీరోలు, డైరెక్టర్లు స్పందించి ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో యంగ్ డైరెక్టర్ అది కూడా తమిళ్ డైరెక్టర్ ఈసినిమాపై స్పందించి ప్రశంసించారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు విఘ్నేష్ శివన్. తన సోషల్ మీడియా ద్వారా ఈసినిమాపది రోజుల కలెక్షన్స్ పోస్టర్ ను పోస్ట్ చేస్తూ.. న్యూ ఏజ్ కాంబినేషన్ బోల్డ్ టీమ్ తో రికార్డులు బద్దలవుతున్నాయి.. ఈసినిమా గ్రాండ్ సక్సెస్ కొట్టినందుకు కంగ్రాట్స్..బోల్డ్ గా రాసిన కథను అంతే బాగా తెరకెక్కించారు అని ప్రశంసల వర్షం కురిపించాడు. మరి తెలుగు సినిమాకు పక్క రాష్ట్రల నుండి ప్రశంసలు దక్కడం అంటే గొప్ప విషయమే కదా.

కాగా ఈసినిమాను మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు. సినిమాకు విజయ్ బుల్ గానిన్ సంగీతం అందించారు. కాగా సినిమాటోగ్రాఫర్ గా బాల్ రెడ్డి, ఎడిటర్ గా విప్లవ్ నైషధం పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − twenty =