నారా రోహిత్ ప్రతినిధి2 ఫస్ట్ లుక్ రిలీజ్

nara rohit new movie title and first look out

బాణం సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాలోనే తన సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు నారా రోహిత్. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. నారా రోహిత్ కూడా మొదటినుండీ కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఇక రోహిత్ నుండి మూవీ వచ్చి చాలా కాలమే అవుతుంది. అయితే చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నారా రోహిత్ హీరోగా మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే ఈసినిమా నుండి ప్రీలుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక తాజాగా ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు ప్రతినిధి2 అనే టైటిల్ ను పెట్టారు. అంటే ఈసినిమా ప్రతినిధి సిరీస్ నుండి రానున్న రెండవ ఫ్రాంచైజీ కానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంటుంది. మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్ తో అందరినీ ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది.

మరి పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. యూనిక్ కథ, గ్రిప్పింగ్ కథనంతో అందరి ప్రశంసలు అందుకుంది. ప్రతినిధి 2 కోసం కూడా సాలిడ్ కథతో రానున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఈసినిమా ఎంతవరకూ ఆకట్టుకుంటుందో.

కాగా వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాను కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 25, 2024వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − six =