తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే తెలుగులో తను నటించిన సార్ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరోో సినిమాతో వచ్చేస్తున్నాాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈసినిమా 1930-40ల నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాకా తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే శరవేగంగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గానే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాలో కూడా ధనుష్ డిఫరెంట్ మేకోవర్ తో అలరించబోతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఫ్యాన్స్ కు సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. జులై 28వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
Let’s gooo pic.twitter.com/vpwyG4gSaz
— G.V.Prakash Kumar (@gvprakash) July 24, 2023
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, ఆర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈసినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: