సెలెబ్రటీస్ అందరూ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గానే ఉంటారు. ఒకప్పుడు అంటే ఏదో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాల్లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే కదా. ఎంతమంది ఫాలోవర్లు ఉంటే అంత గ్రేట్ అన్నమాట. ఇక ఈ సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పలు రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉండేవాడు. ఇప్పటికే ఇన్‌స్టాలో బన్నీ మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా మరో రికార్డ్ ను క్రియేట్ చేశాడు. రీసెంట్ గా ఇన్‌స్టాకు అనుసంధానంగా థ్రెడ్స్ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఈ యాప్ లో అప్పుడే అల్లు అర్జున్ 1 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ ఫీట్ ను అందుకున్న తొలి ఇండియన్ హీరోగా కొత్త రికార్డును క్రియేట్ చేసుకున్నాడు. ఈనేపథ్యంలో బన్నీ ఫ్యాన్స్ ఎక్కడైనా తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. నిజానికి పుష్ప రిలీజ్ తరువాత బన్నీ క్రేజ్ నార్త్ లో విపరీతంగా పెరగడంతో ఫాలోవర్ల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అయితే బన్నీ పుష్ప.. ది రూల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా పుష్ప సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: