బేబి బాక్సాఫీస్ వద్ద హావ కొనసాగిస్తోంది.విడుదలై 10రోజులవుతున్న కూడా ఏమాత్రం జోరు దక్కించడం లేదు.నిన్న ఈసినిమా మొదటి రోజు కంటే 10వ రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టి షాక్ ఇచ్చింది.నిన్న ఒక్క రోజే 6కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో 10రోజుల్లో ఈసినిమా 66.6కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది.ఇదే రన్ ను కొనసాగిస్తే ఫుల్ రన్ లో 100కోట్లు కూడా సాధ్యమయ్యేలానే వుంది.అయితే ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద ఈసినిమాకు పోటీ ఎదురుకానుంది.పవన్ కళ్యాణ్,సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో థియేటర్లలోకి రానుంది.మరి ఆ తరువాత బేబి ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బేబి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను అయ్యి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తీసుకొస్తుంది.చిన్న సినిమాల్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక నిన్న హైదరాబాద్ లోని ఆర్ టి సి క్రాస్ రోడ్ లోని థియేటర్ లో సెకండ్ షోకి లక్ష రూపాయల గ్రాస్ ను రాబట్టి రికార్డు సృష్టించింది.ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య నటించిన ఈసినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేయగా ఎస్ కె ఎన్ నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: