పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా బ్రో. ఈసినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా జులై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా నుండి ఇప్పటికే పాటలు టీజర్ ను రిలీజ్ చేయగా మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే ఓ రేంజ్ లో అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ప్రమోషన్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రిలీజ్ డేట్ ను అలానే వేదికను ఖరారు చేశారు. జులై 25వ తేదీన శిల్ప కళా వేదికలో సాయంత్రం 6 గంటల నుండి ఈ ఈవెంట్ ప్రారంభంకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The much awaited Celebration is here! 😎
Get ready to witness The Synergy of @PawanKalyan & @IamSaiDharamTej
at the Grand Pre-release Event of #BroTheAvatar 💥📍 July 25th at Shilpakala Vedika, Hyderabad from 6 PM onwards! 🥳#BroTrailer ▶️ https://t.co/sd50DeV6kc… pic.twitter.com/orSFiEuir2
— People Media Factory (@peoplemediafcy) July 24, 2023
ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: