తమిళ్ స్టార్ హీరో సూర్య డిఫరెంట్ సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అందుకే వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో కథతో వస్తున్నాడు. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి ఏదో ఒక అప్ డేట్ రాబోతున్నట్టు ఇప్పటికే అర్థమయిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. యుద్ద రంగంలో చేతిలో కత్తి పట్టుకొని గుర్రం మీద ఉన్న సూర్య పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ అయితే వస్తుంది. గ్లింప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ అయితే ఫుల్ వ్యూస్ తో దూసుకుపోతుంది. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే దాదాపుగా 25 మినియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.
కాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: