VS10, VS11 పై విశ్వక్ అప్ డేట్

vishwak sen gave interesting updates on his VS10 and VS11 movies

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం సినిమా జయాపజయాలతో పనిలేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక రీసెంట్ గానే ధమ్కీ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు రాబోతున్న సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం విశ్వక్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటికి ఇంకా టైటిల్స్ ఫిక్స్ చేయలేదు. అనే వర్కింగ్ టైటిల్స్ తోనే షూటింగ్ ను పూర్తిచేసుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా #VS10. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ దశలోనే ఉంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తన 11వ సినిమా వస్తుంది. VS11 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా రూపొందుతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ,శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రీసెంట్ గానే ఈసినిమా సెకండ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

ఇదిలా ఉండగా తాజాగా తన రెండు సినిమాలపై సోషల్ మీడియా వేదికగా అప్ డేట్ ఇచ్చాడు. నా 10 వ సినిమా సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసినప్పుడు నాహార్ట్ కృతజ్ఞతలతో నిండిపోయింది.. నేను ప్రతిరోజూ పొందుతున్న పని అవకాశాలు మరియు మీ ప్రేమ ఇంకా మద్దతు అపారమైనవి. మీ సపోర్ట్ తోనే నేను ప్రతి నెలా దాదాపు 25 రోజులు పని చేసే అవకాశాన్ని పొందుతున్నానని తెలిపాడు. vs11 షూటింగ్ దాదాపు 50శాతం పూర్తయింది.. vs10 సగం షూట్‌ని పూర్తి చేయడానికి మేము దగ్గరగా ఉన్నాము… రెండు సినిమాాలకు కూడా సూపర్ సంగీతాన్ని అందించాయి.. త్వరలో టైటిల్‌లను తెలియచేస్తాము.. ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ప్రేమను తెలియజేయాలనుకుంటున్నాను. అందరికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.