క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రాజెక్ట్ కే రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రెండు రోజులుగా చిత్రయూనిట్ యూఎస్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే కదా. యూఎస్ఏ లోని శాన్ డియాగో కానిక్ కాన్ ఈవెంట్ కోసం గాను చిత్రయూనిట్ అక్కడికి వెళ్లింది. ఆ ఈవెంట్ లోనే ఈసినిమా టైటిల్ ను అలానే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో చూస్తూనే ఉన్నాం. విజువల్స్ అయితే ఓ రేంజ్ లో ఉన్నాయి. ఫస్ట్ లుక్ తో కాస్త్ డిజప్పాయింట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్ కు గ్లింప్స్ తో ఫుల్ ట్రీట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా గురించి విలక్షణ నటుడు కమల్ హాసన్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెగెటివ్ లేనిదే పాజిటివ్ అనేది లేదు..నెగెటివ్ రోల్స్ సినిమాల్లో చాాలా కీలక పాత్ర పోషిస్తాయి. రెండు నెగెటివ్ లు ఒక పాజిటివ్ అవుతుంది.. సో మరో విలన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను.. ఇలాంటి టైమ్ పీరియడ్ సినిమాల్లో నటించడం చాలా ఎగ్జైయిటింగ్ గా ఉంది అంటూ తెలిపాడు.
ఇంకా అమితాబ్ మాట్లాడుతూ.. నాగి ఈ రోల్ కోసం నన్ను అడిగినప్పుడు నేను ఏం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను. వారి ప్రొడక్షన్ నుండి వచ్చిన సినిమాలను, వారి వర్క్ ను నేేను చూస్తున్నాను కాబట్టి పెద్దగా ఆలోచించలేదు. ప్రాజెక్ట్ కే ఒక అసాధారణమైన ఎక్స్ పీరియన్స్.. ఈసినిమా కోసం నాగి చేసిన రీసెర్చ్ వర్ణించలేనిది అని తెలిపారు.
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























