పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా బ్రో. ఈసినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా జులై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాకు క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తోడు ఉన్న క్రేజ్ ను తమ అప్ డేట్స్ ను ఇస్తున్నారు మేకర్స్ కూడా. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, అలానే ఫస్ట్ సింగిల్ మై డియర్ మార్కండేయ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చాయి. ఇప్పుడు సెకండ్ సింగిల్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నెరజానవులే అనే సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా గురించి మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చాడు థమన్. ఈసినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్నట్టు తన ట్విట్టర్ ద్వారా ఒక ఫొటోను పోస్ట్ చేస్తూ తెలియచేశాడు.
#BROBGM !! 🫶 pic.twitter.com/v2gL1FtUoi
— thaman S (@MusicThaman) July 14, 2023
ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: