సామజవరగమన సాలిడ్ కలెక్షన్స్- 12 రోజుల్లో 40 కోట్లు

sree vishnu samajavaragamana movie 12 days collections

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. తనదైన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అందుకే శ్రీవిష్ణు సినిమా అంటే సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక రీసెంట్ గా సామజవరగమన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను అందుకున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం లో ఈసినిమా తెరకెక్కింది. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో శ్రీవిష్ణు తన నటనతో మరోసారి మెప్పించాడు. శ్రీవిష్ణుతో పాటు నరేష్ నటన కూడా ఈసినిమాకు మరో హైలెట్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి ఈసినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే రిలీజ్ అయింది. అయితే రిలీజ్ తరువాత మాత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం మౌత్ టాక్ తోనే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. విమర్శకులు నుంచి అభిమానులు, సినీ ప్రేక్షకులు, సెలబ్రిటీల వరకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం మూవీకి ప్లస్ పాయింట్ గా మారింది. దీంతో కలెక్షన్స్ లో కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఈసినిమా జూన్ 29వ తేదీన రిలీజ్ అవ్వగా 12 రోజుల్లో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఎలాంటి అంచనాాలు లేకుండా వచ్చిన ఈసినిమా ఇంత సక్సెస్ అవ్వడంతో చిత్రయూనిట్ సంతోషంలో ఉన్నారు.

కాగా ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించగా.. ఇంకా వెన్నెల కిశోర్‌, నరేశ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రల్లో నటించారు. ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్‌, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించగా.. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =