బ్రో ఫస్ట్ సింగిల్ మై డియర్ మార్కండేయ లోడింగ్

first single update from pawan kalyans bro movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రో. మామా అల్లుడు కలిస చేస్తుండటంతో ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం అనేే సినిమాకు రీమేక్ గా వస్తుంది. మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖనే ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమా జులై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ఆ దిశగా మిగిలిన పనులను పూర్తిచేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో పడింది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఇప్పటికే మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే రీసెంట్ గా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. మై డియర్ మార్కండేయ అంటూ వచ్చే ఈపాట లోడింగ్ అవుతుంది అంటూ తెలిపారు. రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నారు.

ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 10 =