తనయుడి మూవీపై సునీత ఎమోషనల్ పోస్ట్

sunitha emotional post on sarkaru naukari movie first look

సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు సర్కారు నౌకరి అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా గత కొద్దినెలలుగా షూటింగ్ ను జరుపుకుంటూనే ఉంది. ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న చిత్రయూనిట్ చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. తాజాగా ఈసినిమా నుండి ఆకాష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది. ఇక ఈ సందర్భంగా సునీత తన సోషల్ మీడియాలో ఎమోషన్ పోస్ట్ షేరు చేసింది. ఒక తల్లీ, కుమారి కల నెరవేరిన రోజు.. కంగ్రాట్స్ ఆకాష్.. ఈ పోస్టర్ నువ్వు ప్రపంచానికి చెప్పాలను కథను తెలియచేయడంతో పాటు నువ్వు పడిన శ్రమ, హార్డ్ వర్క్, డెడికేషన్, త్యాగలకు నిదర్శనం. సినిమా పట్ల నీకు ఉన్న ఇష్టాన్ని త్వరలోనే ప్రపంచం చూడబోతుంది.. ప్రతిరోజూ మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ సునీత తన పోస్ట్ లో పేర్కొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాను లెజెండరీ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావు ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆకాశ్‌కు జోడీగా భావనా వళపండల్ నటిస్తోంది. ఈమెకు కూడా హీరోయిన్‌గా ఇదే తొలి సినిమా. ఇంకా ఈసినిమాలో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ ఇతర పాత్రల్లో కనిపించనుననారు. శాండిల్య సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కూడా గంగనమోని శేఖర్ పనిచేస్తుండటం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 7 =