గత ఏడాది కార్తికేయ2 తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు యంగ్ హీరో నిఖిల్.ఈసినిమా తెలుగు లోనే కాదు హిందీలోనూ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఇక కార్తికేయ 2 తరువాత నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ స్పై.నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.రీసెంట్ గా రిలీజైన టీజర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకోగా కొద్దీ సేపటి క్రితం ట్రైలర్ విడుదలైంది.ఇక ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది.ట్రైలర్ చివర్లో రానా కనబడి షాక్ ఇచ్చాడు.రానా ఈసినిమాలో ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు.ఈసినిమాలో నిఖిల్ రా ఏజెంట్ గా కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చాలా తక్కువ రన్ టైంతో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.గ్యారీ బి హెచ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా అభినవ్ గోమఠం,సన్యా మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా శ్రీ చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.రాజశేఖర్ రెడ్డి,చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మించిన ఈసినిమా తెలుగు తోపాటు ఇతర భాషల్లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: