లియో నా రెడీ సాంగ్ రిలీజ్

vijays leo movie first single naa ready lyrical song out now

ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ వెంటనే మరో సినిమాను మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తర్వాత విజయ్‌, లోకేశ్ కనగరాజ్‌ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో లియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అంచనాలను పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా నేడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా పవర్ ఫుల్ గా ఉన్న పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నా రెడీ అంటూ వచ్చే ఈపాట ప్రోమోను రెండు రోజుల ముందే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. నారెడీ అంటూ వచ్చే ఈసాంగ్ మంచి బీట్ తో ఆకట్టుకుంటుంది. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కలిసి విజయ్ సొంతంగా ఆలపించడం విశేషం.

ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ గా.. అన్బరివ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 1 =