ఆదిపురుష్- పిల్లల కోసం మనోజ్ దంపతులు కూడా

manchu manoj and bhuma mounika to buy 2500 adipurush telugu movie tickets for orphanage kids

దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ప్రభాస్ ఆదిపురుష్ కోసం. ఇక ఈసినిమాకు రోజు రోజుకు క్రేజ్ కూడా అంతే భారీగా పెరిగిపోతుంది. మరోవైపు ఇంతకుముందెన్నడూ జరగని విధంగా ఈసినిమా విషయంలో ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు చోటుచేసుకుంటున్నాాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఈసినిమా టికెట్ బుకింగ్స్ ను బట్టి చెప్పొచ్చు ఈసినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను అందరికీ చూపించాలని ప్రతి ఒక్కరూ ముందుకు రావడం విశేషం. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో బాలీవుడ్ రణ్ బీర్ కపూర్ ఈసినిమాను పేద పిల్లలకు చూపించాలన్న ఉద్దేశంతో 10 వేల టికెట్లను కొనుగోలు చేశాడు. ఇక ఇప్పుడు మంచు మనోజ్ దంపతులు కూడా ఈ లిస్ట్ లో యాడ్ అయ్యారు. అనాథ చిన్నారులకు ఉచితంగా ఆదిపురుష్ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు మంచు మనోజ్‌. ఆదిపురుష్ సినిమా ఎలాంటి సరిహద్దులేకుండా అందరూ చూడాల్సిన సినిమా.. ఇక ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకుంటూ.. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లోని 2500 మంది అనాథ చిన్నారులకు మైథలాజికల్ మాస్టర్ పీస్‌ రామాయణం ఆధారంగా వస్తున్న ఆదిపురుష్‌ చిత్రాన్ని జూన్‌ 16న చూపించాలని నిర్ణయించుకున్నాం. బృహస్పతి టెక్‌, నమస్తే వరల్డ్‌తో కలిసి ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. దీంతో మనోజ్ దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా ఓం రౌత్ దర్శకత్వంలో 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ మీడియా సంస్థ ఈసినిమా హక్కులు సొంతం చేసుకోగా.. నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 6 =