మాస్ రాజా రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు.ఈఏడాది ఫస్ట్ హప్ లో వాల్తేరు వీరయ్య,రావణాసురతో ప్రేక్షుకులను పలకరించగా తను నటిస్తున్న మరో సినిమా కూడా విడుదలకు సిద్దమవుతుంది.అదే టైగర్ నాగేశ్వర రావు.ఈసినిమా అక్టోబర్ 20న విడుదలకానుంది.ఇక ఈసినిమాతోపాటు రవితేజ,ప్రస్తుతం సినిమాటోగ్రఫర్ కం డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తన 73వ సినిమాలో నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.కొద్దిసేపటి క్రితం మేకర్స్ ఈసినిమా గ్లిమ్స్ తోపాటు టైటిల్ ను కూడా రివీల్ చేశారు.ఈసినిమాకు ఈగల్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఇక ఈవీడియో చూస్తే ఈగల్ హాలీవుడ్ మూవీస్ స్టయిల్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు అనిపిస్తుంది.ఈగల్ లో రవితేజ ను సరికొత్త స్టైల్లో ప్రెజంట్ చేయనున్నాడు కార్తిక్ ఘట్టమనేని.మొత్తానికి గ్లిమ్ప్స్,టైటిల్ తో సినిమాకు హైప్ క్రీయేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా నవదీప్,మధుబాల కీలకపాత్రల్లో నటిస్తున్నారు.దేవ్ జాన్డ్ సంగీతం అందిస్తున్నాడు.
డైరెక్టర్ గా మాత్రమే కాకుండా ఈసినిమాకు స్టోరీ,స్క్రీన్ ప్లేను అందిస్తుండడంతోపాటు ఎడిటింగ్ కూడా చూసుకుంటున్నాడు కార్తిక్ ఘట్టమనేని.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఇంతకుముందు కార్తిక్ ఘట్టమనేని రవితేజ నటించిన డిస్కో రాజా,ధమాకా సినిమాలకు డీఓపీ గా పనిచేశాడు.మరి ఇప్పుడు ఈగల్ వీరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఈ సంక్రాంతికి వేసేది చలి మంట కాదు దావాగ్ని! 🔥🦅
Mass Maharaja @RaviTeja_offl's #Eagle MASSive ERUPTION – Title Announcement Video OUT 🔥https://t.co/C7u7oOOMxy
Sankranthi Release, 2024 🥁@Karthik_gatta @anupamahere @vishwaprasadtg @vivekkuchibotla
@pnavdeep26… pic.twitter.com/2y4WT9UdqT— People Media Factory (@peoplemediafcy) June 12, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: