టాలీవుడ్ టాలెంటెడ్ అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. నటుడిగానే కాదు అటు రచయితగా కూడా తన టాలెంట్ ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అందుకే వరుసగా హిట్లను అందుకుంటు కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది మేజర్, హిట్ 2 అంటూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అడివి శేష్. రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. రెండు సినిమాలు కూడా రెండు డిఫరెంట్ జోనర్లు. మేజర్ పేట్రియాటిజం నేపథ్యంలో అలానే హిట్ 2 సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పటివరకూ అడివి శేష్ ను థ్రిల్లర్ సినిమాల్లోనే చూశాం. క్షణం సినిమా దగ్గర నుండి గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 ఇలా అన్ని థ్రిల్లర్ జోనర్ లోనే తీశాడు. ఫుల్ ఫ్లెడ్జ్ లవ్ స్టోరీ తో ఇప్పటివకూ రాలేదు. అయితే మొదటిసారి లవ్ స్టోరీతో రాబోతున్నాడు. ఇక విషయాన్ని అధికారికంగా తెలియచేశాడు. గూఢచారి 2 సినిమా తరువాత లవ్ స్టోరీ చేస్తున్నా.. రాబోయే రోజుల్లో ఈసినిమా గురించిన అధికారిక ప్రకటన రానుంది అంటూ తెలియచేశాడు. చూద్దాం మరి అడివి శేష్ ఫుల్ లవ్ స్టోరీతో ఎలా కొత్తగా కనిపించబోతున్నాడో.
Next one (other than G2) will be a Love Story. ❤️
Will Announce in the coming months.
— Adivi Sesh (@AdiviSesh) June 12, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: