సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి రణ్ బీర్ పోస్టర్లను రిలీజ్ చేయగా అవి ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా టీజర్ ను జూన్ 16వ తేదీన రిలీజ్ చేయనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ప్రీ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. దీనికి టైమ్ కూడా ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. జూన్ 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ప్రీ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్‌కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాను ఆగష్ట్ 11, 2023 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.. మరి అనుకున్న డేట్ కే రిలీజ్ చేస్తారా?లేదా?అన్నది చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: