నటసింహం బాలకృష్ణ మాత్రం ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్బీకే 108 ఒక సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక ఈసినిమాలో బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల అలరించనుందంట. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాల నుండి అప్ డేట్స్ వచ్చేస్తున్నాయి. రెండు రోజుల నుండే ఆ సందడి మొదలైంది. ముందు ఎన్బీకే 108 మూవీ టైటిల్ ను రిలీజ్ చేశారు. దానికి భగవంత్ కేసరి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నేడు టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది.
ఇదిలా ఉండగా అప్పుడే మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టేశాడు బాలకృష్ణ. నేడు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా NBK109 సినిమాను పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమానికి త్రివిక్రమ్, ఎన్టీఆర్ కుమారులలో ఒకరైన నందమూరి రామకృష్ణ, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన వై. రవి శంకర్ ఇంకా ఇండస్ట్రీ నుండి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: