రేపు ఏకంగా 9 సినిమాలు రిలీజ్ 

9 films are being released tomorrow.

ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సినిమాలు క్యూ కడుతున్నాయి.అయితే ఈ సారి ఈ సంఖ్య చాలా ఎక్కువగా వుంది.ఏకంగా 9సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.ఇందులో ఒకటి రీ రిలీజ్ సినిమా కూడా వుంది.ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సిద్దార్థ్ నటించిన ద్విభాషా చిత్రం టక్కర్ రేపు తమిళ్ తోపాటు తెలుగులోను రేపు విడుదలవుతుంది. ఈసినిమా తెలుగు రైట్స్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దక్కించుకుంది.ప్రమోషన్స్  కూడా బానే చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో చూడాలి.

ఇక తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కుటుంభ కథా చిత్రంగా తెరకెక్కిన సినిమా ఇంటింటి రామాయణం.రాహుల్ రామకృష్ణ ,నరేష్,నవ్య స్వామి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.ట్రైలర్ ఆసక్తిగా వుంది.టికెట్ రేట్లు కూడా రీజనబుల్ గానే వున్నాయి.సింగిల్ స్క్రీన్ 100,మల్టీ ఫ్లెక్స్ లో 112 రూపాయలుగా వుంది.

ఇక ఇవిగాక మరో నాలుగు చిన్న సినిమాలు విమానం,అన్ స్టాపబుల్,కౌశిక వర్మ దమయంతి,పోయే ఏనుగు పోయే, అనంత విడుదలకానున్నాయి అలాగే వీటితోపాటు ఇంగ్లీష్ డబ్బింగ్ మూవీ ట్రాన్సఫార్మర్స్ రైజ్ అఫ్ ది బీస్ట్స్ అలాగే నందమూరి బాలకృష్ణ కల్ట్ మూవీ నరసింహనాయుడు రీ రిలీజ్ అవుతుంది.బాలకృష్ణ బర్త్ డే సందర్బంగా నరసింహ నాయుడు రీ రిలీజ్ అవుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.