లియో సాంగ్ షూట్ లో విజయ్

vijay in a song shoot for leo movie

తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. లియో అనే టైటిల్ తో వస్తున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. అంతేకాదు చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా షూటింగ్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం విజయ్ ఒక సాంగ్ షూట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. చెన్నైలోని ఆదిత్య రామ్ స్టూడియోలో ఈపాటను చిత్రీకరిస్తున్నారట. అక్కడ వేసిన భారీ సెట్ లో మూడు రోజుల పాటు ఈపాటను షూట్ చేయనున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ గా.. అన్బరివ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =