ఆదిపురుష్- హనుమంతుడి కోసం స్పెషల్ సీట్

adipurush movie team sentimental decision

ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో ఈసినిమా వస్తుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 16వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు రిలీజ్ చేశారు. అవి సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరగనున్న సంగతి తెలిసిందే కదా. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. అంతేకాదు ఏ సినిమాను చేయనంత యూనిక్ గా ఈసినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఈనేపథ్యంలోనే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా చిత్రనిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటకి హనుమంతుడు విచ్చేస్తాడని అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ.. ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా టెలికాస్ట్ అవనున్న ప్రతి థియేటర్లో ఒక సీటును హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించనున్నారు. చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా ఈ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాం ఆదిపురుష్ మేకర్స్. ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీగా రానున్న ఆదిపురుష్ సినిమాను హనుమంతుడి సమక్షంలో వీక్షిద్దాం అని పోస్ట్ లో పేర్కొన్నారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

కాగా 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + eighteen =