శిరీష్ కొత్త సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్

allu sirish new movie first look and glimpse out

గౌరవం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. ఇక ఆ తరువాత నుండి పలు సినిమాలు చేస్తూ కెరీర్ ను కొననసాగిస్తున్నాడు. అయితే ఇప్పటివరకూ సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టింది మాత్రం లేదు. ఇక గత ఏడాది ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ ఇప్పటివరకూ మరే కొత్త సినిమాను ప్రకటించలేదు. ఈనేపథ్యంలోనే నిన్న తన కొత్త సినిమాకు సంబంధించి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చాడు. రిలీజ్ చేసిన ప్రీ లుక్ లో టెడ్డీ బేర్ ఉండటంతో డిఫరెంట్ కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈసినిమా ఆర్య టెడ్డీ లా ఉందన్న కామెంట్స్ కూడా వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించి అప్ డేట్ వచ్చేసింది. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలానే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు బడ్డీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. గ్లింప్స్ అయితే ఆకట్టుకుంటుంది. ఇంకా ఈసినిమాకు సంబంధించిన పలు వివరాలు కూడా తెలియచేశారు.

కాగా ఈసినిమాకు శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రిషా సింగ్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. తమిళ నటుడు అజ్మల్, అలీ ముఖేష్ రిషీ కూడా ఒక కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. ఆంటోని రూబెన్ ఎడిటర్ గా, క్రిష్ణన్ వసంత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరి ఈసినిమాతో అయినా అల్లు శిరీష్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 16 =