బ్రో నుండి సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్

sai dharam tej first look out from bro movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వినోదయసితం అనేే సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఫాంటసీ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఇప్పుడు ఈసినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాతృకకు సముద్రఖని దర్శకత్వం చేయగా.. తెలుగులో కూడా తనే రీమేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడింది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన పార్ట్ ను కంప్లీట్ చేసేశాడు కూడా. తేజ్ కూడా షూటింగ్ తో మళ్లీ బిజీ అయిపోయాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాను ఎంత సైలెంట్ గా మొదలుపెట్టారో అంతే సైలెంట్ గా షూటింగ్ ను పూర్తిచేస్తున్నారు. నిజానికి ఈసినిమా మొదలైనప్పుడు అంత హైప్ కూడా లేదు. కానీ ఎప్పుడైతే టైటిల్ ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారో సినిమాపై ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. ఇక దానిని ఎక్కడా తగ్గించకుండా చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది. దీనిలో భాగంగానే సాయి థరమ్ తేజ్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. నిన్న ఈసినిమా నుండి మార్క్ ను పరిచయం చేస్తాము అంటూ ఎప్పుడైతే అప్ డేట్ వచ్చిందో అప్పటినుండీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా తేజ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వచ్చేసింది. ఈసినిమాలో తేజ్ మార్క్ అలియాస్ మార్కండేయులు అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు. ఫుల్ వైట్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో ఉన్న తేజ్ లుక్ అయితే ఆకట్టుకుంటుంది.

ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =