ఫైనల్ స్టేజ్ లో చంద్రముఖి2

raghava lawrences Chandramukhi 2 movie in the final stages

పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమిళ్ సినిమా అయినా తెలుగులో డబ్ అయి ఇక్కడ రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా సంచలన విజయం దక్కించుకుంది. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు సీక్వెల్ రాబోతున్న సంగతి కూడా తెలిసిందే కదా. అయితే ఈసారి రాఘవ లారెన్స్ ఈసినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడింది చిత్రయూనిట్. ఇప్పటికే కంగనా తన పార్ట్ కు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి చేరుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే లారెన్స్ ఇంకా వడివేలు ఇంకా ఇతర నటీనటుల మధ్య కీలక సన్నివేశాలను మైసూర్, కర్ణాటక ప్రాంతాల్లో చిత్రీకరించారట. మరికొద్ది రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తవనున్నట్టు సమాచారం.

కాగా చంద్రముఖి సినిమాకు దర్శకత్వం వహించిన పి.వాసునే ఈసినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రాజశేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. మరి సీక్వెల్స్ గా వచ్చిన సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. ఈనేపథ్యంలో అప్పట్లో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన ఈసినిమా.. ఇప్పుడు సీక్వెల్ లో ఎలా ఉంటుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 18 =