ఓం రౌత్ దర్శకత్వంలో రామయణం నేపథ్యంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈసినిమా జూన్ 16న విడుదల కాబోతోంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ తర్వాత సినిమాపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఈసినిమా నుండి రెండు రోజులు క్రితం జైశ్రీరామ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే మొదటి నుండి బ్యాక్ గ్రౌండ్ జైశ్రీరామ్ అంటూ వచ్చే గ్లింప్స్ కే సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. ఇక ఇప్పుడు ఫులు సాంగ్ కు ఊహించని రీతిలో రెస్పాన్స్ దక్కుతుంది. అజయ్- అతుల్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి పదజాలం అన్నీ పాట మరింత బలాన్ని చేకూర్చడంతో గూజ్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈపాట మూడ్ నుండి ఇంకా బయటకు రాకముందే మరో క్రేజీ అప్ డేట్ తో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు రామజోగయ్యశాస్త్రి. తన ట్విట్టర్ ద్వారా ఆదిపురుష్ పాటల గురించి మాట్లాడుతూ… ఏ రాశారు సర్ అంటూ నాకు ఒక వాయిస్ నోట్ తో అప్రిషియేషన్ నోట్ వచ్చింది.. అది ఇచ్చింది ఎవరో కాదు డార్లింగ్ ప్రభాస్.. ప్రభాస్ కు సిన్సియర్ థ్యాంక్స్.. ఇంతకీ నేను మాట్లాడేది కొత్త సాంగ్ మంగళప్రభాతము అనే పాట గురించి అంటూ తరువాత వచ్చే సాంగ్ గురించి ఇప్పుడే హింట్ ఇచ్చి క్యూరియాసిటీ పెంచుతున్నాడు.
One voice note of appreciation..
“Em raasaru Sir” from none other than d Darling of hearts..dearest #prabhas garu..a day before..makes it all d more special..sincere thanks to him💕I m talking about a new song..
The one u heard in the teaser..
Mangalapradhamu…😜#Adipurush— RamajogaiahSastry (@ramjowrites) May 21, 2023
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.