నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు.. అలాగే సినీ ప్రముఖులు కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా తన ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలియచేశాడు. హ్యాపీ బర్త్ డే తారక్.. ఈరోజు చాలాా ఆనందకరమైన రోజు.. ఇంకా యాక్షన్ ప్యాక్డ్ ఇయర్ కావాలని కోరుకుంటున్నాను. యుద్దభూమిలో నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను.. మనం కలిసేంతవరకూ నువ్వు ప్రతిరోజు ఆనందంగా..శాంతిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. హృతిక్ ట్వీట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు. మరి హృతిక్ విషెస్ తో వార్ 2 సినిమాపై మరింత క్లారిటీ వచ్చినట్టైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happy Birthday @tarak9999! Wishing you a joyous day and an action packed year ahead. Awaiting you on the yuddhabhumi my friend. May your days be full of happiness and peace
…until we meet 😉
Puttina Roju Subhakankshalu Mitrama 🙏🏻
— Hrithik Roshan (@iHrithik) May 20, 2023
ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఒకరోజు ముందే ఈసినిమా నుండి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక దీని తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమాను చేయనున్నాడు. ఇక వార్2 సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.