టీజర్,ట్రైలర్,సాంగ్స్ ఏ కాదు ఈమధ్య కాలంలో ఫస్ట్ లుక్ కూడా సినిమాకు హైప్ తెప్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.మేకర్స్ కూడా ఫస్ట్ లుక్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని రిలీజ్ చేస్తున్నారు.ఇక రీసెంట్ గా మచ్ అవైటెడ్ మూవీస్ ఫస్ట్ లుక్ లుబయటికి వచ్చాయి.అందులో ఎస్ఎస్ఎమ్బి 28, పుష్ప ది రూల్,గేమ్ చేంజెర్,ఉస్తాద్ భగత్ సింగ్,బ్రో,దేవర ఫస్ట్ లుక్ లు రిలీజ్ అయ్యాయి.వీటన్నింటికి సూపర్ రెస్పాన్స్ వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
SSMB 28:
ఇందులో మొదటగా మహేష్ బాబు,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ విడుదలకాగా మాస్ లుక్ లో మహేష్ స్టిల్ ఫ్యాన్స్ ను ఖుషి చేసింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారిక హాసిని నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.ఈనెల 31న ఈసినిమాకు సంబందించిన అప్డేట్ రానుంది.
పుష్ప ది రూల్ :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో బ్లాక్ బాస్టర్ పుష్పకు సీక్వెల్ గా వస్తుంది పుష్ప ది రూల్. ఈసినిమా ఫస్ట్ లుక్ అయితే సోషల్ మీడియాలో పలు రికార్డులు సృష్టించింది.చిత్తూరు జిల్లాలో జరిగే గంగమ్మ తల్లి అవతారంలో వున్న ఫొటో లో అల్లు స్టిల్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈసినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.
గేమ్ చేంజర్ :
రామ్ చరణ్,శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఈసినిమా నుండి విడుదలైన రామ్ చరణ్ లుక్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్ బైక్ మీద కూర్చొని వున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ గా వదిలారు. గేమ్ చేంజర్ ను దిల్ రాజు నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమా కూడా వచ్చే ఏడాది విడుదలకానుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.అందులో స్టైలిష్ లుక్ లో వున్న పవన్ స్టిల్ ఆకట్టుకుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమా కుడా వచ్చే ఏడాదే విడుదలకానుంది.
బ్రో :
రెండు రోజుల కిందట విడుదలైన బ్రో ఫస్ట్ లుక్ కు విశేషమైన స్పందన వచ్చింది.అల్ట్రా స్టైలిష్ లుక్ లో వున్న పవన్ పిక్ సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈసినిమాలో పవన్ కళ్యాణ్,సాయి తేజ్ కలిసి నటిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తుండగా సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈసినిమా ఈజూలై 28న విడుదలకానుంది.
దేవర :
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈసినిమా ఫస్ట్ లుక్ నిన్న విడుదలైయింది.సముద్రపు ఒడ్డున నిలబడి చేతిలో ఆయుధం తో డిఫ్రెంట్ గెటప్ లో ఎన్టీఆర్ కనిపించాడు.ఈఫస్ట్ లుక్ ట్విట్టర్ లో అతి తక్కవ సమయంలో 100k లైక్స్ ను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈసినిమా కు దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.
మరి మిమ్మల్ని ఎక్కువగా ఇంప్రెస్ చేసిన ఫస్ట్ లుక్ ఏదో ఓట్ ద్వారా తెలపండి👇
[totalpoll id=”99237″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: