కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా విరూపాక్ష. ఈసినిమా ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక రిలీజ్ తరువాత కూడా ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. రుద్రవరం అనే ఊరు.. ఆ ఊరిలో వరుసగా హత్యలు జరగడం.. దానికి కారణం ఏంటో హీరో కనిపెట్టడమే ఈ సినిమా కథ. మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా ఆందరినీ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని సాయి ధరమ్ తేజ్ కు కెరీర్ బెస్ట్ హిట్ ను అందించడమే కాకుండా..కలెక్షన్స్ విషయంలో కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఈ సినిమా విడుదలై 27 రోజులు పూర్తయింది. ఇక ఇప్పుడు ఈసినిమా 100కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ సినిమా 100 కోట్లను రాబట్టినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.
Supreme Hero @IamSaiDharamTej‘s #Virupaksha celebrates the Spectacular Commercial Triumph 🥳🥁#BlockbusterVirupaksha amasses Incredible 1️⃣0️⃣0️⃣ Crores with Immense Love from audience ♥️@iamsamyuktha_ @karthikdandu86 @Shamdatdop @AJANEESHB @SVCCofficial @SukumarWritings pic.twitter.com/UcftHOtRPv
— SVCC (@SVCCofficial) May 18, 2023
ఇక సాయి ధరమ్ తేజ్ నెక్ట్స్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వినోదయసీతం అనే సినిమాకు రీమేక్. ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముగించుకుంటుంది ఈసినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈసినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: