నటీనటులు : సంతోష్ శోభన్,మాళవిక నాయర్,రాజేంద్ర ప్రసాద్,గౌతమి
ఎడిటింగ్ :జునైద్
సినిమాటోగ్రఫీ :సన్నీ కూరపాటి,రిచర్డ్ ప్రసాద్
సంగీతం : మిక్కీ జె మేయర్
దర్శకత్వం :నందిని రెడ్డి
నిర్మాత: ప్రియాంక దత్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జయాపజయాలతో సంబందం లేకుండా ఏడాదికి మినిమం రెండు సినిమాలతో బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్.ఈఏడాది ఫిబ్రవరి లో శ్రీదేవి శోభన్ బాబు తో పలుకరించిన సంతోష్ ఇప్పుడు అన్నీ మంచి శకునములే అంటున్నాడు.అలా.. మొదలైంది ఫేమ్ నందిని రెడ్డి దీనికి డైరెక్టర్ కావడం అలాగే ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం తో అన్నీమంచి శకునములే ఫై అంచనాలు ఏర్పడ్డాయి.మరి ఈరోజు థియేటర్లోకి వచ్చిన ఈసినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.
కథ :
రెండు కుటుంబాల మధ్య జరిగే కథతో తెరకెక్కింది ఈసినిమా.ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్),సుధాకర్ (నరేష్) కుటుంబాల మధ్య ఓ కాఫీ ఎస్టేట్ కు సంబందించిన విషయంలో వివాదం కొనసాగుతుంది.రిషి(సంతోష్ శోభన్),ఆర్య (మాళవిక నాయర్) వీరి కుటుంబాలకు చెందిన పిల్లలు.వీరి మధ్య ఎలాంటి గొడవలు వుండవు.వీరిద్దరూ ప్రేమలో పడతారు.ఈక్రమంలో రిషి,ఆర్యలు ఆ రెండు కుటుంబాలను కలిపారా లేదా వారు కూడా కొత్త సమస్యలేమైన తీసుకొచ్చారా అనేదే మిగతా కథ.
విశ్లేషణ :
డైరెక్టర్ నందిని రెడ్డి అంటే గుర్తొచ్చేది ఫీల్ గుడ్ మూవీస్.అన్నీ మంచి శకునములే ను కూడా అదే బాటలో తెరకెక్కించింది.అందులో ఆమె మరోసారి సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.సింపుల్ స్టోరీతో ఒక డీసెంట్ అర్బన్ ఫ్యామిలీ డ్రామాను అందించారు.ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగిన ఫీలింగ్ వచ్చినా సెకండ్ హాఫ్ లో పట్టు చూపించారు.ఇందులో వచ్చే కామెడీ సన్నివేశాలు,సాంగ్స్ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి.ముఖ్యంగా క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే క్యాస్టింగ్ సినిమాకుహెల్ప్ అయ్యింది.లీడ్ రోల్స్ లో నటించిన సంతోష్ శోభన్,మాళవిక నాయర్ తమ పాత్రలకు బాగా సెట్ అయ్యారు.సంతోష్ యాక్టింగ్ గత సినిమాలకంటే ఈసినిమాలో బాగుంది.మాళవిక నాయర్ మంచి పెర్ఫార్మర్ అని ఈసినిమాతో మరోసారి నిరూపించింది. మిగితా పాత్రల్లో నటించిన రాజేంద్ర ప్రసాద్,రావు రమేష్,గౌతమి,వెన్నెల కిషోర్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే డైరెక్టర్ గా నందిని రెడ్డి ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తెర మీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యింది.మిగితా టెక్నీషియన్స్ కూడా ఆమెకు బాగా సహకరించారు. ముఖ్యంగా మిక్కీ జె మేయర్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది.సాంగ్స్ బాగున్నాయి.బీజీఎమ్ సూపర్.సినిమాటోగ్రఫీ బాగుంది.సినిమా చాలా రిచ్ గా వుంది.ఎడిటింగ్ ఓకే.ప్రియాంక దత్ సినిమాకు చాలానే ఖర్చు పెట్టారు.
ఓవరాల్ గా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనెర్ గా వచ్చిన అన్నీ మంచి శకునములే కామెడీ సీన్స్,సాంగ్స్,క్లైమ్యాక్స్ హైలెట్ అయ్యాయి.ఈసినిమా ఫ్యామిలీతో కలిసి చూసేలా వుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: