విరూపాక్ష ఓటిటిలోకి ఎప్పుడు రానుందంటే 

virupaksha gets ott relase date

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష గత నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది.25రోజుల్లో ఈసినిమా 92కోట్ల క్లబ్ లోకి వసూళ్లను రాబట్టి సాయి ధరమ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక ఇప్పుడు విరూపాక్ష నెట్ ఫ్లిక్స్ లో రానుంది.ఈనెల 21న ఈసినిమా స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.సరిగ్గా అప్పటికి విరూపాక్ష విడుదలై నెలరోజులు కానుంది.అజనీష్ లోక్ నాథ్ అందించిన బిజీఎమ్ సినిమాలో హైలెట్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమ్మానాన్నలను చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో తమ కళ్ల ముందే రుద్రవరం ఊరులోని ప్రజలు సజీవ దహనం చేస్తారు దాంతో సజీవదహనానికి బలైన వారి పిల్లలు ఊరిపై ఏవిధంగా పగ తీర్చుకోవాలనుకున్నారు దాన్ని హీరో ఎలా అడ్డుకున్నాడనేది మిగితా కథ.కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా సునీల్,రాజీవ్ కనకాల,సాయి చంద్ కీలకపాత్రల్లో కనిపించారు.ఎస్విసిసి,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఇక ఈసినిమా తరువాత సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వినోదయం సీతం రీమేక్ లో నటిస్తున్నాడు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇందులో దేవుడి గా కనిపించనున్నాడు.ఈపాత్రకు తాలూకు షూటింగ్ ని కూడా పవన్ పూర్తి చేశాడు.త్వరలోనే ఈసినిమా నుండి టైటిల్,ఫస్ట్ లుక్ విడుదలకానుంది.థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.జులై 28న ఈసినిమా విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 6 =