యంగ్ హీరో విజయ్ దేవరకొండ,సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా ఈరోజు కేరళ లో కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ నా రోజా నువ్వే విడుదలచేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. తెలుగు తోపాటుహిందీ, తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో ఈ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటివరకు 20మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి అదుర్స్ అనిపించింది.తెలుగు లో ఈ సాంగ్ కోటి కి పైగా వ్యూస్ రాబట్టి ట్రెండింగ్ లో నిలిచింది. డైరెక్టర్ శివ నిర్వాణ పాటను ను రాయగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు. అతనికి తెలుగులో ఇదే మొదటి సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 2న విడుదలకానుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈసినిమా ఫై మంచి అంచనాలు వున్నాయి. ఇక లైగర్ తరువాత విజయ్ దేవరకొండ ఈసినిమా తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.గత ఏడాది వచ్చిన లైగర్ నిరాశపరిచింది. మరి ఖుషి తోనైనా విజయ్ సూపర్ హిట్ కొట్టి ట్రాక్ లోకి వస్తాడో చూడాలి.
ఖుషి తరువాత విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నటించనున్నాడు.ఈ సినిమా ఇటీవలే లాంచ్ అయ్యింది.శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్,శ్రీకర స్టూడియోస్,ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సినిమాతో పాటు విజయ్ పరశురామ్ తో ఓ సినిమా చేయనున్నాడు.దిల్ రాజు ఈసినిమాను నిర్మించనున్నాడు.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: