మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తరువాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా ఒక సినిమా తరువాత మరో సినిమా చేసేస్తున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేశారు. రీసెంట్ గానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టినట్టు తెలిపారు చిత్రయూనిట్. ఇక తాజాాగా ఈసినిమా పై మరో అప్ డేట్ వచ్చింది. ఈసినిమా కొత్త షెడ్యూల్ నేటి నుండి ప్రారంభమైంది. ఇన్ని రోజులు ఇక్కడే షూట్ జరుపుకున్న చిత్రయూనిట్ ఈ షెడ్యూల్ కోసం కోల్ కత్తా వెళ్లింది. కొన్ని రోజులపాటు అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
The Swag of Mega🌟@Kchirutweets from the streets of Yamahanagari ❤️
& the sets of #BholaaShankar 🔱Bholaa Shankar Vibe In Theatres on AUG 11th🤟🏻@MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @IamSushanthA @dudlyraj #MahathiSwaraSagar @prakash3933 @AdityaMusic pic.twitter.com/0n4ssRQWnP
— AK Entertainments (@AKentsOfficial) May 4, 2023
కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు. ఈసినిమా ఆగష్ట్ 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: