రివ్యూ : ఏజెంట్

Agent Telugu Movie Review

నటీనటులు :అఖిల్,సాక్షి వైద్య,మమ్ముట్టి
ఎడిటింగ్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ :రసూల్ ఎల్లోర్
సంగీతం : హిప్ హాప్ తమిళ
దర్శకత్వం :సురేందర్ రెడ్డి
నిర్మాతలు :రామ్ బ్రహ్మం సుంకర,దీపా రెడ్డి

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్షన్ ఎంటర్టైనర్ అఖిల్ తో సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ అక్కినేని.ఈసినిమా తరువాత చేసిన మూడు సినిమాల్లో లవర్ బాయ్ గా కనిపించాడు. ఇక ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించాడు.స్టైలిష్ మేకర్ గా పేరు తెచ్చుకున్నసురేందర్ రెడ్డి దీనికి డైరెక్టర్ కావడం అలాగే టీజర్, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. మరి ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.

కథ :

మహాదేవ్ (మమ్ముట్టి) రా ఆఫీసర్. సిండికేట్ గా ఏర్పడిన మాఫియా గ్యాంగ్ ను పట్టుకోవడం లో విఫలమవుతాడు.ఈ గ్యాంగ్ కు హెడ్ గాడ్ (డినో మోరియా).దేశాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకుంటాడు.ఇక రిక్కీ (అఖిల్)కు ఎలాగైనా ‘రా’ లో చేరాలని చిన్నప్పటి నుండి కోరిక ఉంటుంది. ఈ క్రమంలో మహాదేవ్,రిక్కీ ని తన హ్యాకింగ్ స్కిల్ చూసి రా లోకి తీసుకుంటాడు. ఆతరువాత సిండికేట్ గ్యాంగ్ ను పట్టుకోవడానికి రిక్కీ ఏం చేశాడు.వారిని పట్టుకోవడంలో రిక్కీ కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి. ఇంతకీ రిక్కీ ఆ మిషన్ ను పూర్తి చేశాడా అనేదే మిగితా కథ.

విశ్లేషణ :

వక్కంతం వంశీ అందించిన కథ కొత్తదేం కాదు తెలుగులో కూడా ఇలాంటి స్టోరీలు వచ్చాయి.కానీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దాన్ని డీల్ చేసిన విధానం బాగుంది.అఖిల్ ను రా ఏజెంట్ ను బాగా చూపించాడు.ఫస్ట్ హాఫ్ లో ప్రీ ఇంటర్వెల్,ఇంటర్వెల్ సీన్స్ థ్రిల్ చేస్తాయి.క్లైమ్యాక్స్ లో భారీ గన్ తో అఖిల్ చేసే ఫైట్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. సినిమా లో యాక్షన్ సన్నివేశాలు ప్రధానంగా హైలైట్ అయ్యాయి అలాగే మిషన్ సక్సెస్ చేయడంలో అఖిల్ కు ఎదురైనా సవాళ్లు కూడా ఆసక్తిగా ఉంటాయి.అఖిల్ క్యారెక్టర్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. మమ్ముట్టి తన అనుభవాన్ని చూపించారు.అఖిల్,మమ్ముట్టి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంగేజింగ్ గా వున్నాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే అఖిల్ ఈసినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది.సినిమా అంతా వన్ మ్యాన్ షో చేశాడు.హుషారుగా కనిపిస్తూ రిక్కీ పాత్రకు న్యాయం చేశాడు.మహాదేవ్ పాత్రకు మమ్ముట్టి బాగా సెట్ అయ్యాడు.ఆ పాత్రలో తన ప్రతిభ చూపెట్టాడు అలాగే హీరోయిన్ పాత్రలో నటించిన సాక్షి వైద్య బాగానే నటించింది.తనకు ఇదే మొదటిసినిమా.స్క్రీన్ మీద చాలా గ్లామర్ గా కనిపించింది.విలన్ పాత్రలో నటించిన డినో మోరియా యాక్టింగ్ బాగుంది.మిగితా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పాత్రల మేర చేశారు.

టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి ఓకే అనిపించారు.సురేందర్ రెడ్డి అంటే ప్రధానంగా గుర్తొచ్చే సినిమాలు కిక్,ధ్రువ.ఈ రెడింటిని చాలా స్టైలిష్ గా తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు ఏజెంట్ ను కూడా అలాగే డీల్ చేశాడు.ముఖ్యంగా అఖిల్ పాత్రను చాలా స్టైలిష్ గా డిజైన్ చేశాడు.కథ లో కొత్తధనం లేకున్నా దాన్ని తెర మీదకు తనదైన స్టైల్లో తీసుకొచ్చాడు.హిప్ హప్ తమిళ సాంగ్స్ డీసెంట్ గా వున్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది.రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ ఓకే.నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది.నిర్మాతలు ఈసినిమాకు భారీ గా ఖర్చు పెట్టారు.

ఓవరాల్ గా స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ ఏజెంట్ లో అఖిల్ నటన,లుక్ అలాగే మమ్ముట్టి యాక్టింగ్ సినిమాలో హైలైట్ అయ్యాయి.అక్కినేని అభిమానులకు మాత్రమే కాదు యాక్షన్ మూవీ లవర్స్ కు ఈసినిమా నచ్చుతుంది.

ఏజెంట్ ట్రైలర్:

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 17 =